డిప్యూటీ కలెక్టరైన కిడాంబి శ్రీకాంత్

kidambi-srikanthబ్యాడ్మింటన్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాంత్‌ ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతన్ని డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో గౌరవించింది. గతేడాది విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాంత్‌ను గ్రూప్-1 సర్వీసెస్‌లో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్‌ కోటా కింద ఈ నియామకం చేపట్టారు.

డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి బాధ్యతలు స్వీకరించారు. గొల్లపూడిలో భూ పరిపాలన కమిషనర్ అనిల్ చంద్ర నుంచి శ్రీకాంత్‌ ఆర్డర్ పేపర్స్ స్వీకరించారు. తనను ప్రోత్సహించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు కిడాంబి. తాను కోరినట్లే గుంటూరులో పోస్టింగ్‌  ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates