డిప్యూటీ సీఎం కోదండరామ్.. ప్రపోజల్ నిజం కాదన్న టీజేఎస్

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ కు కాంగ్రెస్ నాయకత్వం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వజూపిందంటూ వస్తున్న వార్తలను తెలంగాణ జన సమితి తప్పుపట్టింది. దీనికి సంబంధించి కోదండరామ్ ఆధ్వర్యంలోని టీజేఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం(అక్టోబర్ 14) టీజేఎస్ పార్టీ .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మధ్య జరిగిన భేటీలోఇలాంటి ప్రస్తావన రాలేదని క్లారిటీ ఇచ్చింది.

కావాలనే కొందరు నేతలు.. కొన్ని పార్టీ నేతలు తమపై చెడు ప్రచారం చేస్తున్నాయని టీజేఎస్ చెప్పింది. మహాకూటమిలో తమకు సరైన స్థానం ఉంటుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు 3 అంశాలను ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తలను తప్పు పడుతున్నామన్నారు. కోదండరాంకు డిప్యూటీ సీఎం పదవి…. టీజేఎస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ… ఎన్నికలలో కోదండరాం నిలబడకూడదు.. అనే మూడు వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates