డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఎంపీ కవిత ఛాలెంజ్


డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిలను ఛాలెంజ్ కు నామినేట్ చేశారు కవిత. తాము ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నామని.. మొక్కలు నాటుతామని  ప్రకటించారు. శనివారం(జులై-21) హైదరాబాద్ లోని తన ఇంటి ముందు ఎంపీ కవిత ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాధాకృష్ణ ,రాజమౌళి వీరు ముగ్గురు ఒక్కొక్కరు మూడు మొక్కల చొప్పున నాటాల్సి ఉంటుంది.

ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని  ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారం లో భాగంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ ఛాలెంజ్ చేశారు.ఛాలెంజ్ ను స్వీకరించిన కవిత శనివారం(జూలై-21) మూడు మొక్కలు నాటడంతో పాటు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.

మొక్కలు నాటడం తో పర్యావరణ సమతుల్యం పెరిగి స్వచ్ఛ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని దీనికి సంబంధించి  అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఎంపీ కవిత. మొక్కలు నాటడమే కాదు..ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates