డిఫెన్స్ ఎక్స్‌ పోతో ఇండ‌స్ట్రియ‌ల్ బేస్ పెరుగుతుంది : మోడీ

defenceexpo modi openభారతీయ చరిత్రాత్మక నాగరికతను స్థాపించిన చోళుల సామ్రాజ్యానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రధాని మోడీ. గురువారం (ఏప్రిల్-12) తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌ పోను ప్రారంభించిన మోడీ.. వాణిజ్యం, విద్య చోళుల రాజ్యంలో వెల్లువిరిశాయన్నారు. రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన కోసం 500 భారతీయ కంపెనీలు రావడం అద్భుతంగా ఉందన్నారు. ఈ ఈవెంట్‌ లో 150 విదేశీ కంపెనీలు కూడా పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమానికి 40 దేశాలకు చెందిన డెలిగేట్లు కూడా వచ్చినట్లు ప్రధాని తెలిపారు. శాంతికి కట్టుబడి ఉన్నామని, దాని కోసం రక్షణ దళాలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  వ్యూహాత్మక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌ ను ఏర్పాటు చేస్తామన్నారు. 110 ఫైటర్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ లను కొనేందుకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో రెండు డిఫెన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్స్‌ ను ఏర్పాటు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు.  ఈ కారిడార్స్‌ తో ఆర్థిగ అభివృద్ధితో పాటు డిఫెన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ బేస్ కూడా పెరుగుతుంద‌న్నారు. ఇన్నోవేష‌న్ ఫ‌ర్ డిఫెన్స్ ఎక్స‌లెన్స్ స్కీమ్‌ ను ప్రారంభించామ‌ని, దాని ద్వారా డిఫెన్స్ ఇన్నోవేష‌న్ హ‌బ్స్‌ ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, ర‌క్ష‌ణ రంగాల‌కు కావాల్సిన స్టార్ట‌ప్‌ ల‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు ప్రధాని మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates