డిమాండ్ గట్టిగా ఉంది : గో సంరక్షణ కోసం మంత్రిత్వ శాఖ

COWమధ్యప్రదేశ్ లో ఆవు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు ఆ రాష్ట్ర మంత్రి హోదా కలిగిన స్వామి అఖిలేశ్వరానంద్. రాష్ట్ర సంక్షేమం కోసం గో సంరక్షణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన సీఎంకు విన్నవించారు. ఈ విషయమై గతంలో కూడా తాను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడినట్లు అఖిలేశ్వరానంద్ తెలిపారు. రాష్ట్రంలోని అన్నీ గో సంరక్షణ శాలలను పునరుద్దరిస్తానని.. వాటికి నిధుల కొరత లేకుండా చూస్తానని సీఎం తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

నేషనల్ అగ్రికల్చర్ మరియు MGNREGA కమిటీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చైర్మన్ గా అయినందువల్ల తప్పకుండా కౌ-మినిస్ట్రీని ఏర్పాటు చేస్తాడన్న నమ్మకం తనకు ఉందని అఖిలేశ్వరానంద్ తెలిపారు. ఈ స్కీమ్ కింద రాష్ట్రానికి రూ.15 వేల కోట్లు వస్తాయని.. అందులో సగం నిధులను కూడా ఖర్చు చేయడం లేదని తెలిపారు. గోసంరక్షణ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయనకు ఇటీవలే మంత్రి హోదా కూడా వచ్చింది. మధ్యప్రదేశ్ గో సంరక్షణ మండలికి తాను చేసిన సేవల కారణంగానే మంత్రిగా పదోన్నత లభించినట్టు అఖిలేశ్వరానంద్ ఈ సందర్భంగా తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates