డిసెంబర్‌లో మెట్రో రైలు పాసులు…ఆర్టీసీతో లింక్

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. త్వరలోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పాస్ జారీ చేయనుంది. డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. నెల పాసుల జారీ విషయమై చర్చలు జరపాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎల్ అండ్ టీ యాజమాన్యాన్ని కోరింది. ఈ మెట్రో పాస్ కామన్ మొబిలిటీ కార్డుతో లింక్ అవుతుంది. అంటే ఈ పాస్ ఆర్టీసీతో పాటు ఇతర ప్రజారవాణా వ్యవస్థలకు కూడా వినియోగించొచ్చు.

మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు నెల వారీ పాసుల జారీ అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి . ఈ పాసులను అందరికీ అందుబాటులో ఉండే ధరకే అందించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామన్నారు. మెట్రో ఆర్టీసీతో అనుసంధానం అయ్యేలా పాసులు తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం స్మార్ట్ కార్డే పాసులా పనిచేస్తోందన్నారు.

మెట్రో రైలు దిగగానే ఆర్టీసీబస్సుల్లో ప్రయాణించేందుకు ఎల్&టీ హెదరాబాద్ మెట్రో రైల్ కలిసి ఒక కామన్ టికెటింగ్ మెకానిజంతో ముందుకు రావాలని యోచిస్తున్నామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. కామన్ మొబిలిటీ కార్డులు జారీ చేసేందుకు ఇప్పటికే ఎల్&టీ మెట్రోరైలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రవాణా వ్యవస్థలో సదుపాయాల ఏర్పాటు విషయమై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో స్మార్ట్ టికెటింగ్ వ్యవస్థపై ఆర్టీసీ మెట్రోరైల్ కలిసి చర్చించడమే కాదు డెమో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్క ప్రజారవాణా వ్యవస్థకే కాదు ప్రైవేట్ కంపెనీలు ఊబెర్, ఓలా సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతాయని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates