డిసెంబర్‌ నుండి మెట్రో పాస్‌లు

మెట్రో ప్రయాణికులకు త్వరలో మరో సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ నెలలో హైదరాబాద్ మెట్రో రైలు నెలవారీ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్‌లు మాదిరిగా మెట్రోపాస్‌లు అందుబాటులోకి తేవాలని L&T మెట్రోరైలు సంస్థకు సూచించింది. స్మార్ట్‌కార్డును పోలి ఉండే మెట్రో పాస్‌ల ద్వారా మెట్రో మాల్స్ లో షాపింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు. డే పాస్ కూడా ప్రయాణీకులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. హైటెక్‌సిటీ మార్గం పూర్తికావడం ద్వారా హైదరాబాద్ మెట్రోరైలు మార్గంలో 56 కిలోమీటర్ల ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది.

Posted in Uncategorized

Latest Updates