డిసెంబర్ 11నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అదే రోజు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరుతూ ఆమె ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీజేపీ ప్రభుత్వం నిర్వహించే పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశం ఇదే కానుంది. రాజ్యసభ ఛైర్మన్,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిసెంబర్ 10న ఆల్ పార్టీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 11న ప్రారంభమయ్యే ఈ సమావేశాలు జనవరి 8వరకు జరుగుతాయి.

Posted in Uncategorized

Latest Updates