డిసెంబర్ 21న ఆర్జీవీ ‘వెన్నుపోటు’

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మరో ఇంట్రస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తాను తీస్తున్న సినిమాకు సంబంధించిన ఓ కొత్త సంగతిని వివరించాడు. నిజమైన కథతో ఈ మూవీ తీస్తున్నానని… ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్ అయ్యాక.. తన సినిమా కథ మొదలవుతుంది ఇప్పటికే చెప్పిన వర్మ.. ఈసారి వెన్నుపోటుపై ఫోకస్ పెట్టాడు. ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు.. వెన్నుపోటుతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. లాంటివి త్వరలోనే తెలుస్తాయన్నాడు. వెన్ను పోటు పాటకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఎల్లుండి అంటే డిసెంబర్ 21న సాయంత్రం నాలుగింటికి విడుదల చేస్తా అన్నాడు రామ్ గోపాల్ వర్మ.

వర్మ స్టేట్ మెంట్ ఇచ్చిన కొన్నిగంటలకే ఓ బాహుబలి స్పూఫ్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాహుబలి స్థానంలో ఎన్టీఆర్ బయోపిక్… కట్టప్ప స్థానంలో RGV లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫొటోలతో ఓ మీమ్(meme) వైరల్ అవుతోంది. ఇలా తప్పుడు ఇమేజ్ లా మాత్రం తన సినిమా ఉండదని … వాస్తవమైన కథ ఉంటుందని వర్మ చెప్పాడు.

 

Posted in Uncategorized

Latest Updates