డిసెంబర్ 31 తర్వాత మీ బ్యాంకు కార్డులు పనిచేయవు

 డిసెంబర్ 31 తరువాత మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్లకు మెసేజ్ లను పంపిస్తున్నాయి. బ్యాంకు ఎకౌంట్ లు హ్యాక్ కు గురికాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 2016 వరకు దేశంలోని అన్ని బ్యాంకులు ఏటీఎం పై చిప్ లేని డెబిట్, క్రెడిట్ కార్డులను ఇచ్చేవి. చిప్ లేని కార్డులు హ్యాక్ అవుతాయని భావించిన ఆర్బీఐ చిప్ తో కూడిన కార్డులను ఇవ్వాలని బ్యాంకులకు ఆధేశించింది. దీని వలన ఎకౌంట్ హ్యాక్ కాకుండా అరికట్టగలమని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది.

కొత్త కార్డులను తీసుకోవడానికి డిసెంబర్ 31వ తారీకును డెడ్ లైన్ గా పెట్టింది. చిప్ తో వస్తున్న కొత్త కార్డులను ఈఎంవీ కార్డులని అంటారు. ఈ కార్డులను పొందడానికి సమీప బ్రాంచ్ కు వెళ్లి అప్లైయ్ చేసుకోవాలని, ఇంటర్ నెట్ లో కూడా అప్లైయ్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.  మీ కార్డు పై బంగారం రంగు ఉన్న చిప్ ఉన్నట్లయితే మీరు కార్డు మార్చు కోవలసిన అవసరం లేదు. లేదంటే తప్పక మార్చుకోండి.

Posted in Uncategorized

Latest Updates