డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు

2018 డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఓం ప్రకాశ్ రావత్ తెలిపారు. ఇవాళ(శనివారం, అక్టోబర్-6) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగబోయే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 19. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22. తెలంగాణతో పాటు రాజస్థాన్ లో కూడా డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 12న మొదటి దశలో 18 నియోజక వర్గాలకు…. 20న రెండో దశల్లో 72 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మధ్యప్రదేశ్, మిజోరాం లో నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే నెల 28న ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates