డీఎంకే అధినేత కరుణానిధికి స్వల్ప అస్వస్థత

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ  సీఎం కరుణానిధి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కరుణానిధికి అయన  ఇంట్లోనే  డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఓ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి జ్వరం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారని తెలిపారు.  ఆరోగ్య దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని ఆయన కుమారుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్  స్టాలిన్ తెలిపారు.

అయితే కొన్ని నెలల క్రితం కూడా కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల ట్రీట్ మెంట్ తర్వాత ఆయన కోలుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates