డీఎస్ కొడుకు వేధిస్తున్నాడు : హోంమంత్రికి విద్యార్థినులు ఫిర్యాదు

రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) కుమారుడు సంజయ్‌ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్‌ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం(ఆగస్టు-2) ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో చెప్పారు. ఈ సంఘటనపై మహిళా సంఘాలు భగ్గమన్నాయి. తక్షణమే సంజయ్‌ ను అరెస్ట్‌ చేయాలనీ, శాంకరి నర్సింగ్‌ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates