డీఏపీ ధరలు పెంపు : అమ్మల్లోకి కొత్త ధరలు

dapసాగు ఖర్చు తగ్గించాలని, 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఇటీవల బడ్జెట్‌లోనూ రైతు ఆదాయం రెట్టింపుపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధమైన చర్యలకు దిగింది. సాగు ఖర్చు పెరిగేలా చర్యలకు ఉపక్రమించింది.
కేంద్ర కనుసన్నల్లోనే ఎరువుల ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ ప్రకారం పెరిగిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఎరువుల ధర పెరిగిన కారణంగా ఒక్కో ఎకరాకు అదనంగా రూ.వెయ్యి వరకు రైతుపై భారం పడుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రబీలో రైతులకు ఇది శాపంగా మారుతుందని భావిస్తున్నారు. వచ్చే జూన్‌లో మరోసారి ధరలను పెంచాలని కంపెనీలు యోచిస్తుండటం గమనార్హం.

డీఏపీ బస్తా రూ.1,215

ప్రస్తుతం రబీ సీజన్‌లో వరి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. వరి నాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు విరివిగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచేశాయి. డీఏపీ 50 కిలోల బస్తా ప్రస్తుత ధర రూ.134 పెంచాయి. దీంతో రూ.1,081గా ఉన్న ధర, ఇప్పుడు రూ.1,215కు చేరింది. 0.5 శాతం జింక్‌ ఉండే డీఏపీ ప్రస్తుత ధర రూ.1,107 కాగా, రూ.1,240 పెరిగింది. అంటే కంపెనీలు బస్తాకు రూ.133 అదనంగా పెంచేశాయి. ఇక కాంప్లెక్స్‌ ధరలు రూ.57 నుంచి రూ.120 వరకు అదనంగా పెరిగాయి.

Posted in Uncategorized

Latest Updates