డీలర్ల డిమాండ్: గౌరవ వేతనాలు, పెండింగ్ బకాలివ్వండి 

RATIONపెండింగ్ బకాయిలతో పాటు… తమిళనాడు, కేరళ తరహలో గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు రేషన్ డీలర్లు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ తో నిన్న జరిగిన చర్చల్లో.. డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 30 వరకు డెడ్ లైన్ పెట్టారు డీలర్లు.

సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న రేషన్ డీలర్లు.. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తో చర్చలు జరిపారు. ఇప్పటికే సమ్మెకు సిద్ధమైన డీలర్లు.. అకున్ ముందు తమ డిమాండ్లను వివరించారు. అయితే రేషన్ షాపులు నడుస్తున్న తీరు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలు వేశామనీ, కమిటీ నివేదికతో పాటు.. డీలర్ల డిమాండ్లను మూడు రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు కమిషనర్.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇస్తున్నారనీ, అదే తరహాలో తెలంగాణలోనూ ఇవ్వాలని కోరారు రేషన్ డీలర్లు. ప్రభుత్వం నుంచి డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు ఏ డీలర్ కూడా డిడీలు కట్టరని చెప్పారు. ఈనెలాఖరులోపు ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా జులై ఫస్ట్ నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు డీలర్లు

రెండు గంటలు జరిగిన చర్చల్లో.. డీలర్లు సమ్మెకు వెళ్లొద్దని కోరారు కమిషనర్ అకున్ సబర్వాల్. ప్రభుత్వ విజ్ఞప్తిని కాదనీ సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates