డెత్ రిపోర్ట్ : ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి చనిపోయింది

death-report-srideviశ్రీదేవి మరణంపై వ్యక్తం అవుతున్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు దుబాయ్ పోలీసులు. పోస్టుమార్టం ప్రకారం డెత్ సర్టిఫికెట్ కూడా విడుదల చేశారు. ప్రమాద వశాత్తు బాత్ టబ్ లో మునిగి చనిపోయినట్లు తెలిపారు. యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అంటూ వెల్లడించారు. బాత్ టబ్ లో కుప్పకూలి.. ఎవరినీ పిలిచే పరిస్థితుల్లో లేకపోవటం వల్లే చనిపోయినట్లు తెలిపారు. రక్తంలో ఆల్కాహాల్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రమాదవశాత్తు నీటిలో పడటంతోనే శ్రీదేవి చనిపోయిందని ఫోరెన్సిక్ పరీక్షలో తేల్చేశారు. దీనికి సంబంధించి దుబాయ్ ఆరోగ్యశాఖ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ప్రివెంటీవ్ మెడిసిన్ విభాగానికి డైరెక్టర్ గా ఉన్న సమీ వాడీ పేరుతో రిపోర్ట్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో జరుగుతున్నట్లుగా ఎలాంటి విష ప్రయోగాలు జరగలేదన్నారు. రెండో సారి శవ పరీక్ష చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రమాద వశాత్తు బాత్ టబ్ లో పడి చనిపోయినట్లు మీడియాకి విడుదల చేసిన లేఖలో తెలిపారు.
డెత్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ కావటంతో మిగతా పనులు ఊపందుకున్నాయి. శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ వరకు వచ్చి.. అక్కడి నుంచి రిలయన్స్ కంపెనీకి చెందిన ప్రత్యేక విమానంలో ముంబై తీసుకురానున్నారు. ఈ రాత్రి 8 గంటల సమయంలో ముంబై చేరుకోవచ్చని భావిస్తున్నారు.
report-sridevi

Posted in Uncategorized

Latest Updates