డెబిట్‌ కార్డుల క్లోనింగ్‌ ముఠా అరెస్టు

డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. హైదరాబాద్ ATMలలో కార్డ్స్ క్లోనింగ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ ముఠా నుంచి 30 డెబిట్‌ కార్డుల తో పాటు రూ.22 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ATM సెంటర్లలో టెక్నికల్ సమస్యలు సృష్టించి డబ్బులను దోచుకున్నారు.  హిడెన్ వెబ్ కెమెరాలను ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా ఏటీఎంలో చోరీలకు పాల్పడ్డారు. సాంకేతిక సమస్యలు సృష్టించడంతో ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన విషయం… ఎంత డబ్బు డ్రా అయ్యిందనేది కూడా బ్యాంకు అధికారులకు తెలియదు. ఇలాంటి దొంగతనాలు ఇప్పటి వరకు 7 ప్రాంతాల్లో జరిగినట్లు తమ విచారణలో బయటపడిందన్నారు పోలీసులు. ఏటీఎం చోరీలపై తమకు బ్యాంకుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు.

Posted in Uncategorized

Latest Updates