డేంజర్: మున్నార్ లో మైనస్ జీరోకి పడిపోయిన ఉష్ణోగ్రతలు

munnar_is_freezing_below_zero_degrees_right_now_1517907391_725x725దేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో మున్నార్ మొదటిది. కేరళ రాష్ట్రంలో ఉండే మున్నార్ ని చూడటానికి ప్రతిరోజూ దేశ, విదేశాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడి వస్తూ ఉంటారు టూరిస్టులు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా కూడా మున్నార్ లో దొరికే ప్రశాంతత మరెక్కడా లభించదు అని అక్కడి అందాలను చూసిన టూరిస్టులు చెబుతుంటారు. అక్కడి ప్రకృతి అందాలను మాత్రమే కాక అక్కడి చలి వాతావరణాన్ని కూడా టూరిస్టులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అయితే అక్కడి చలి తీవ్రత -0 డిగ్రీలకు పడిపోవడంతో అనారోగ్యానికి గురౌతున్నారు అక్కడికి వచ్చే టూరిస్టులు. సాధారణంగా చల్ల గాలులు తీవ్రత నవంబర్ మొదటి వారంలో మొదలై జనవరి రెండో వారంలో తగ్గిపోతుంది. అయితే కొన్ని రోజులుగా వాతావరణ మార్పుల కారణంగా విపరీతంగా మంచు పడుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఈ రకంగా మంచు పడుతూ చలి తీవ్రత పెరడటం, ఉష్ణోగ్రత -0 డిగ్రీలకు పడిపోవడం తమను కూడా ఆశ్యర్యానికి గురి చేస్తుందంటున్నారు స్ధానికులు. చాలా ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ఈ మంచు పడటం చూస్తున్నామంటున్నారు. దీంతో అదనంగా టూరిస్టులు ఈ అనుభవాన్ని పొందేందుకు ఈ హిల్ స్టేషన్ కు వస్తారని టూరిజమ్ సెక్టార్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదని, అక్కడి టీ పంటలు కూడా దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నాయని స్ధానికులు చెబుతున్నారు. టీ ఆకులు కూడా అధిక మంచు కారణంగా వాడిపోతున్నాయని వారు తెలిపారు. దీని వలన 24 లక్షల రూపాయల నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
leaf
munnar_is_freezing_below_zero_degrees_right_now_1517914335_725x725

Posted in Uncategorized

Latest Updates