డేంజర్ సిగ్నల్ : చిన్నారి రిమోట్ కార్ పేలిపోయింది

carభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం. టేకులపల్లి మండలం కొత్తూరులో రిమోట్ కారు పేలడంతో అరవింద్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. జాతరలో కొన్న రిమోట్ కారుతో ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో చిన్నారి అరవింద్ తీవ్రంగా గాయపడ్డాడు. అరచేయి చితికిపోగా.. లివర్ డ్యామేజ్ అయ్యింది. దీంతో ఖమ్మంలోని  ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు పేరెంట్స్. ప్రస్తుతం బాలుడి పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు డాక్టర్లు.

ఈ కారును ఇటీవల జాతరలో కొనుగోలు చేశారు. అది పాడైపోయింది. రిమోట్ కారులోని బ్యాటరీలను తీసి బాగుచేస్తున్న సమయంలో అది పేలినట్లు చెబుతున్నారు తల్లిదండ్రులు. తీవ్రంగా గాయపడిన చిన్నారి కండీషన్ సీరియస్ గా ఉందని.. పొట్టలోని పేగులు బయటకు రావటంతో ఆపరేషన్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates