డేటా సైన్స్ రంగంలో లక్షా 50 వేల ఉద్యోగాలు : కేటీఆర్

ktr-nasscom3తెలంగాణ రాష్ట్రం అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. AICOE  విషయంలో తెలంగాణే ముందడుగు వేసిందన్నారు. డేటా సైన్స్‌లో విస్తృత ఉపాధి అవకాశాలుంటాయన్నారు. మంగళవారం (ఫిబ్రవరి-20) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది.

మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది. సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ విస్తరణకు తోడ్పడుతున్న నాస్కామ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. డేటా సైన్స్ రంగంలో లక్షా 50 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. అన్ని రంగాలతో డేటా సైన్స్‌కు ముడిపడి ఉందని చెప్పారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు నిర్వహణలో నాస్కామ్ పాత్ర కీలకమైందన్నారు. డాటా సైన్స్, కృత్రిమ మేధాశక్తి అంశాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates