డేటింగ్‌ యాప్స్‌ మగవాళ్లే  ఎక్కువగా వాడుతున్నారు

ఇండియాలోని  డేటింగ్‌ యాప్స్‌ ని మగవాళ్లే ఎక్కువ వాడుతున్నారని రీసెంట్ గా జరిగిన ఓ సర్వేలో తేలింది.  ‘వూ’అనే ఆన్‌ లైన్‌ డేటింగ్‌ సంస్థ దాదాపు ఇరవై వేల మంది యూజర్లను సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలో డేటింగ్‌ యాప్స్‌ వాడుతున్న వాళ్లలో 24 శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా, పురుషులు 76 శాతం ఉన్నారు. అంటే స్త్రీల కంటే పురుషులు దాదాపు మూడురెట్లు ఎక్కువగా ఉన్నారు. యూజర్లు సగటున రోజూ 45 నిమిషాలు ఈ యాప్స్‌ వాడుతున్నారు.

అయితే వీరిలో ఎక్కువ మంది మంచి సంబంధాలు కొనసాగించేందుకే యాప్స్‌ ని వాడుతుండటం విశేషం. కొత్త వాళ్లను కలుసుకునేందుకు, సన్నిహితుల్ని పెంచుకునేందుకే ఎక్కువగా ఈ యాప్స్‌ వాడుతున్నారు. 38 శాతం మంది మంచి సంబంధాల్ని నెలకొల్పేందుకు, 28 శాతం మంది ఇతర ప్రాంతాల వాళ్లను పరిచయం చేసుకునేందుకు, 17 శాతం మంది తమ సన్నిహితుల్ని పెంచుకునేందుకు యాప్ ను యూజ్ చేస్తున్నట్లు తేలింది. మహిళా యూజర్లు ఒకేసారి ముగ్గురు మగవారితో చాట్‌ చేస్తుండగా, మగవాళ్లు మాత్రం అంతకంటే ఎక్కువ మంది మహిళలతో చాట్‌ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates