డేటింగ్ కు వెళ్లాడు..కుప్పకూలాడు : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ స్టూడెంట్ మృతి

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ స్టూడెంట్  మృతి చెందాడు. సోమవారం (జూలై-23) యువతితో డేటింగ్ కు వెళ్లిన మౌలిన్ రాథోడ్ అనే యువకుడు డేటింగ్ తర్వాత కుప్పకూలిపోయాడు. గుర్తించిన పోలీసులు వెంటనే అతడిని హస్పిటల్ కి తరలించగా, చికిత్ప పొందుతూ బుధవారం(జూలై-25) మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు..రాథోడ్ తో ఉన్న యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాథోడ్ డెడ్ బాడీని హైదరాబాద్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇండియన్ ఎంబసీ అధికారులు.   ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

సోమవారం రాత్రి ఓ యువతితో డేటింగ్ వెళ్లిన మౌలిన్ రాథోడ్.. డేటింగ్ తరువాత అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాథోడ్‌ ఉన్న యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాథోడ్ మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మౌలిన్‌ రాథోడ్ స్వస్థలం అహ్మదాబాద్‌. వ్యాపార రీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్థిరపడినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates