డేట్ గుర్తు పెట్టుకోండి : చేప ప్రసాదం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

fishచేప ప్రసాదం  పంపిణీకి ఏర్పాట్లు జోరుగా  సాగుతున్నాయి. ప్రతీ  ఏడాది లాగే.. ఈసారి కూడా  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. జూన్ 8వ తేదీకి.. మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో పనులు చక చకా చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.  ఏటా మృగశిర కార్తె రోజు ఇచ్చే ఈ చేప ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ కి తరలివస్తారు. ఎప్పటి లాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది.

చేప ప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. క్యూలైన్స్, బారికేడ్స్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లడ్ లైట్స్, సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో.. చలువ పందిళ్లు, ఫ్యాన్లు  ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. అంతకుముందు రోజు.. దూద్ బౌలిలోని బత్తిని సోదరుల ఇంట్లో పూజల తర్వాత ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు  బత్తిని వీరన్న గౌడ్. చేప ప్రసాదం కోసం మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను అందిస్తోంది ప్రభుత్వం. ఈసారి కూడా లక్షల్లో ఆస్తమా రోగులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates