డేవిస్ క‌ప్‌లో చ‌రిత్ర‌ సృష్టించిన లియాండ‌ర్

leanderభారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డేవిస్ కప్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. డేవిప్ కప్‌లో 43 సార్లు డేవిస్ కప్ డబుల్స్‌ గెలిచి అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా నిలిచాడు. పేస్ కంటే ముందు ఇరాన్‌కు చెందిన నికోలా పిట్రాంగిలీ డేవిస్ కప్ డబుల్స్‌లో 42 విజయాలు అందుకున్నాడు. శనివారం(ఏప్రిల్-7) జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న, పేజ్ జోడి చైనా జంటపై 5-7, 7-6, 7-6 స్కోరుతో ఈజీగా విజయం సాధించింది. అయితే టోర్నీలో భారత్ 1-2 పాయింట్ల తేడాతో చైనా కంటే వెనుకంజలోనే ఉంది. ఈ టోర్నీలో ఇంకా రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates