డైవర్ భార్య : నా భర్త చావుకి.. పిల్లలను తిట్టొద్దు

ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ప్రతిక్షణం.. చాలా ఉత్కంఠతో ప్రపంచంలోని కళ్లన్నీ ఆ గుహ వైపే చూశాయి. ఎప్పుడు గుహ నుంచి చిన్నారులు బయటకు వస్తారో అని అందరిలో ఉత్కంఠ. చివరకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన థాయ్ లాండ్.. లుయాంగ్ గుహలో నుంచి మంగళవారం(జులై-10) చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. ఈ రెస్కూ ఆపరేషన్ లో ప్రపంచంలోని బెస్ట్ డైవర్లు పాల్గొన్నారు. చిన్నారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో.. దురదృష్టవశాత్తూ సిలిండర్ లో ఆక్సిజన్ అయిపోవడంతో.. డైవర్ సమర్న్ కునన్‌ (38) చనిపోవడం అందరినీ కలిచివేసింది.

తన భర్త చనిపోవడానికి కారణం గుహలో చిక్కుకున్న చిన్నారులు కాదని, వారిని ఎవరూ నిందించవద్దని సుమర్న్ భార్య వలీపోన్ అంటున్నారు. తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వలీపోన్.. ఇకపై నేను ఉదయాన్నే లేచి ఎవర్ని చూడాలి? నువ్వే నా సర్వస్వం, నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ తన భర్త లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్నారు. సమర్న్ చూపించిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, దేవుడు మీకు దైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నామని లక్షలాదిమంది నెటిజన్లు తమ ట్వీట్ల ద్వారా వలీపోన్‌ కి మద్దతు తెలుపుతున్నారు. లుయాంగ్ గుహకి సమర్న్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లుయాంగ్‌ గుహ దగ్గర సమర్న్ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు ఓ థాయ్ కళాకారుడు మందుకొచ్చాడు.

Posted in Uncategorized

Latest Updates