డోంట్ కేర్.. వాయిస్ పెంచుతా : ప్రకాష్ రాజ్ హత్యకు భారీ కుట్ర

PRAసినీ నటుడు ప్రకాష్ రాజ్ పై హత్య చేసేందుకు భారీ ఫ్లాన్ జరిగినట్లు తెలుస్తుంది. జర్నిలిస్టు గౌరీ లంకేష్ ని హత్య చేసినవారే ప్రకాష్ రాజ్ ని కూడా హత్య చేయడానికి ఫ్లాన్ చేశారు. గౌరీ లంకేష్ హత్య కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) విచారిస్తున్న సమయంలో హిందువులకు వ్యతిరేకిగా తయారైన ప్రకాష్ రాజ్ ని కూడా గౌరిలంకేష్ తో కలిపి చంపేస్తే సరి.. అని నిందితులు భావించినట్లు విచారణలో తేలింది. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. దేశంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయని, ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వాతంత్ర్యం ఉందని, తమ అభిప్రాయాలను వ్యతిరేకించానని తనను చంపడమే కరెక్ట్ అని నిందితులు భావించారని తెలిపారు.

దేశంలో ఇంకొక గౌరిలంకేష్ హత్య జరగకూడదు అని అనుకోవడమే తప్పు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కూడా అనేకమంది తనకు సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ రూపంలో చంపేస్తామని బెదిరించారని, కొంతమంది తనపై అక్కడక్కడ దాడికి కూడా పాల్పడ్డారని తెలిపారు. తనను చంపడానికి ఫ్లాన్ చేశారని తెలిసి చాలా ఏడుపు వచ్చిందన్నారు. చంపేస్తూ ఎంతమంది ప్రజల నోరు మూయిస్తారని ప్రకాష్ రాజ్ అన్నారు. మొదటిసారి తనను అంతమొందించేందుకు ఇంత భారీ ప్లాన్ చేశారని ప్రకాష్ రాజ్ తెలిపాడు. ఇటువంటివాటికి తాను భయపడేది లేదని, తన వాయిస్ ఇంకా పెరుగుతుందని జస్ట్ ఆస్కింగ్ కొనసాగుతుందని సృష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates