డోంట్ వర్రీ : డేటా లీక్‌ కాలేదంటున్న వాట్సాప్

whatsappడేటా లీకేజీల వివాదంపై ప్రముఖ మెసేంజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ స్పందించింది. మెసేజ్‌లను ట్రాక్‌ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను కొట్టిపారేసింది. సేకరించిన డేటా మొత్తం ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌గా ఉందని తెలిపింది. యూజర్ల సీక్రెట్, భద్రత తమకెంతో కీలకమని వాట్సాప్‌ అధికార ప్రతినిధి చెప్పారు. కేంబ్రిడ్జ్‌ అనలిటికా లీకేజీ తర్వాత వాట్సాప్‌ పై అనేక విమర్శలు వచ్చాయి.

ఈ  మెసేజింగ్‌ ప్లాట్‌ఫాంను 2014లో ఫేస్‌బుక్‌ సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసే పోస్టింగ్స్‌ కంటే కూడా వాట్సాప్‌లోని గ్రూప్‌ చాట్‌ ఫీచరే యూజర్లకు అతిపెద్ద ముప్పు అని వాదిస్తున్నారు టాప్ అమెరికన్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రిన్యూర్‌ వివేక్‌ వాద్వా. అయితే ఇప్పటికే వాట్సాప్‌ సెక్యూర్‌ కాదంటూ అనేక మంది నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూజర్ల భద్రతకు ఢోకా లేదని.. డోంట్ వర్రీ అని వాట్సాప్ ప్రకటించింది.

Posted in Uncategorized

Latest Updates