డ్యూటీకి రావడంలేదని.. యువకుడిని కట్టేసి చితకబాదారు

petrolవిధులకు రావడం లేదని.. ఓ యువకుడిని పెట్రోల్ పంపుకు కట్టేసి చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్‌ లోని హోసంగాబాద్‌లో గురువారం (జూలై-5) రాత్రి చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా పనులోకి రావట్లేదన్న కోపంతో సదరు వ్యక్తిని బంక్‌ లోని పిల్లర్‌కు కట్టేసి ఆ యాజమాని కొరడాతో చితకబాదాడు.

అంతేకాదు అక్కడే ఉన్న మరోవ్యక్తితో కూడా అతను కొట్టించాడు. ఎంత బతిమిలాడుకున్న అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడికొచ్చిన ఓ వాహనదారుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేయగా, వైరల్‌ కావటంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. తనకు చిన్న యాక్సిడెంట్‌ అయ్యిందని.. అందుకే వారం నుంచి పనిలోకి రావట్లేదని తెలిపాడు బాధితుడు. ఆ కోపంతోనే బంక్‌ ఓనర్‌, అతని స్నేహితుడు తనపై దాడి చేశారని చెప్పాడు.

Posted in Uncategorized

Latest Updates