డ్రంక్ అండ్ డ్రైవా.. మజాకా : జస్ట్ 4 నెలలు.. జరిమానా రూ.2 కోట్లు

drunk & driveడ్రంక్ అండ్ డ్రైవ్.. వీకెండ్ అని లేదు.. వీక్ డేస్ అని లేదు.. 365 రోజులు.. 24 గంటలూ పట్టేస్తున్నారు పోలీసులు. పబ్ అయినా.. బార్ అయినా.. వైన్ షాపు దగ్గర సిట్టింగ్ అయినా నాలుగు పెగ్గులు వేసినా.. ఓ బీరు కొట్టినా ఇట్టే దొరికిపోతున్నారు వాహనదారులు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం.. ట్రాఫిక్ క్రమశిక్షణ కోసం తీసుకొచ్చిన డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇటీవల కాలంలో జైలు కూడా వేస్తున్నారు. రీడింగ్ 90 దాటితేనే జైలు అనే నిబంధన ఉన్నా.. ఇటీవల కాలంలో కొందరికి ఒక రోజు, రెండు రోజుల జైలు శిక్షలు విధిస్తుండటంతో.. వాహదారులు పరేషాన్ లో ఉన్నారు. 2018లో డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కలు తీస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లోనే.. అక్షరాల 9వేల 516 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 1,699 మందికి రెండు నుంచి నెల రోజుల జైలు పడింది.

ఈ లెక్కలు ఇలా ఉంటే.. ఈ నాలుగు నెలల కాలంలోనే.. డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులు జరిమానా (ఫైన్) కింద అక్షరాల రూ.2 కోట్ల 5 లక్షలు కట్టారు. జనవరిలో 3,046, ఫిబ్రవరిలో 2,318, మార్చిలో 1,602, ఏప్రిల్ నెలలో 2,550 కేసులు ఫైల్ అయ్యాయి. రెండుసార్ల కంటే ఎక్కువగా పట్టుబడిన 45 మంది డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు అయ్యింది. ఎక్కువ మంది యువకులు, ఐటీ, అనుబంధ కంపెనీల్లో పని చేస్తుండటంతో.. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌, వీసా క్లియరెన్స్‌ సమయాల్లో ఇబ్బందులు తప్పవనే భయాందోళనలు ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates