డ్రగ్స్ వ్యసనం పూర్వీకుల నుంచే..

మద్యం, డ్రగ్స్ మత్తులో జోగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఆధునిక మానవుడికి ఈ లక్షణాలు పూర్వీకుల నుంచే వచ్చాయంటూ యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూనివర్శిటీ ఆఫ్ ఎథెన్స్ సైంటిస్టులు సంచలన రిపోర్టును ప్రచురించారు. డ్రగ్స్ కు బానిసలైనవారి పూర్వీకులు కూడా వ్యవసనాలకు అలవాటు పడ్డ వారేనని చెప్పారు. ఆక్స్ ఫర్డ్, ఏథెన్స్ నగరాల్లోని డ్రగ్స్ బానిసలపై ఎనిమిదేళ్లుగా చేస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. వీరందరి డీఎన్ ఏలో హెచ్ కే2లనే ప్రత్యేక వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. సాధారణ వ్యక్తుల డీఎన్ ఏలో ఈ తరహా వైరస్ జాడ లేదన్నారు. ఈ వైరసే పూర్వీకుల్లోని అవలక్షణాలను కొత్త తరాలకు వచ్చేలా చేస్తోందని వెల్లడించారు. డొపమైన్ రిలీజ్ ను అదుపు చేసే ఒక జన్యువును హెచ్ కే2 వైరస్ కంట్రోల్ చేస్తుందని వివరించారు. హెచ్ కే2 వైరస్ పై 1990నుంచి ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. కేన్సర్ వచ్చిన కొందరిలో  వైరస్ ను డాక్టర్లు గుర్తించారు. దీంతో కేన్సర్ కు కారనం ఇదేమోనని అనుకున్నారు. కానీ ఏళ్ల కొద్దీ సాగుతూ వచ్చిన పరిశోధనల్లో కేన్సర్ కు హెచ్ కే2కు ఎలాంటి సంబంధం లేదని తేలింది.

Posted in Uncategorized

Latest Updates