డ్రాగన్ తో మిస్సైల్ భేటీ : చైనాలో ఉత్సాహంగా కిమ్ పర్యటన

kimఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనా పర్యటనపై స్పష్టత వచ్చింది. చైనాలో కిమ్‌ పర్యటించాడని.. అయితే అది అనధికారిక పర్యటన మాత్రమేనని చైనా, ఉత్తరకొరియా అధికారిక మీడియాలు ప్రకటించాయి. ఉత్తరకొరియా అధ్యక్ష భాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటన కోసం చైనా వచ్చి వెళ్లారు కిమ్ జోంగ్ ఉన్.
ఆదివారం (మార్చి25) తన భార్య రి సోల్‌ జుతో కలిసి చైనా వెళ్లారు కిమ్‌. బీజింగ్ చేరుకున్న కిమ్ కు చైనా అధికారులు ఘనస్వాగతం పలికారు తన పర్యటనలో భాగంగా మంగళవారం(మార్చి27) జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు కిమ్. బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌ బిల్డింగ్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సత్సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జిన్‌ చెప్పినట్లు ఉత్తరకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియాలో పర్యటించాలన్న కిమ్‌ ఆహ్వానానికి జిన్‌పింగ్‌ అంగీకరించినట్లు తెలిపింది. భేటీ సందర్భంగా… కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్రాల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని, అయితే మా ప్రయత్నాలకు దక్షిణకొరియా, అమెరికా దేశాలు శాంతియుత వాతావరణం కల్పించాలని జిన్‌పింగ్‌ తో కిమ్ అన్నట్లు చైనా మీడియాతెలిపింది. అయితే కిమ్‌ చైనా పర్యటన అనధికారికమే అని చెప్పినప్పటికీ ఆయన కోసం జిన్‌ పింగ్‌ అధికారిక విందును ఏర్పాటుచేశారు.మరోవైపు కిమ్‌ పర్యటన గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు జిన్‌ పింగ్‌ సందేశం పంపినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో ట్రంప్ తో జరుగబోయే భేటీపై తాను ఆసక్తిగా ఉన్నట్లు కిమ్‌ చైనా పర్యటనలో తెలిపారు.
kim2

Posted in Uncategorized

Latest Updates