డ్రైనేజ్, వాటర్ పైప్ లీకేజ్ ఉంటే అధికారులపై కఠిన చర్యలు : దాన కిషోర్

హైదరాబాద్ లో మరోసారి ఆకస్మిక తనిఖీలు చేశారు GHMC కమిషనర్ దాన కిషోర్. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ లో పారిశుద్ద్య పనులను పరిశీలించారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఎక్కడైనా డ్రైనేజ్, వాటర్ పైప్ లీకేజ్ ఉంటే సంబంధిత జలమండలి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు దాన కిషోర్.  ఆలుగడ్డ బావి దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించిన ఆయన… శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. ప్రధాన రహదారులపై నిర్మాణ వ్యర్ధాలు,  రాళ్లు తొలగించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాన కిషోర్.

Posted in Uncategorized

Latest Updates