డ్రైవింగ్ స్కూలే ఇలా చేసింది : పెట్రోల్ బంక్ లో కారు బీభత్సం

drivingcarపెట్రోల్ పంపులో ఎవరికి వారు తమ వెహికిల్స్ లో పెట్రెల్ వేయించుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ఓ కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ( ఫిబ్రవరి-23) ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లో ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ వ్యక్తి డ్రైవింగ్ స్కూల్ కారులో డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఆ వ్యక్తి కారు బ్యాలెన్స్‌ను తప్పాడు. దీంతో కారు రోడ్డుపక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌పై దూసుకెళ్లింది. రెండు, మూడు వాహనాలు ధ్వంసం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే పిల్లింగ్ స్టేషన్ లో ఉన్న పెట్రోల్ కానీ లీక్ అయివుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని బంకు స్టాఫ్ చెబుతున్నారు. డ్రైవింగ్ నేర్పించాల్సిన డ్రైవింగ్ స్కూల్ కారే ఇలా యాక్సిడెంట్ చేయడం ఎంటని కామెంట్స్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చే సమయంలో సరైన డ్రైవర్ పక్కన ఉండాలని.. లేదంటే ఇలాంటి ప్రమాదాల జరుగుతాయంటున్నారు నెటిజన్స్.

Posted in Uncategorized

Latest Updates