డ్రోన్లతో రైల్వే లైన్ల సర్వే

railwayరైల్వే ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో కొండప్రాంతాల్లోని రైల్వేలైన్ల సర్వేకు డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించింది. ముంబై-పూణే, ముంబై-నాసిక్ రైలు మార్గాల్లో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరగకుండా డ్రోన్ల సాయంతో సర్వే నిర్వహిస్తూ రైళ్ళు నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి కల్యాణ్ సెక్షన్ లో డ్రోన్లతో సర్వే నిర్వహించనున్నారు. కిలోమీటరు దూరం డ్రోన్ల సర్వేకు రూ.4వేలు ఖర్చు అవుతుంది.

Posted in Uncategorized

Latest Updates