డ్రోన్స్ తో హైదరాబాద్ ట్రాఫిక్ కు చెక్..


ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేరనో.. ఎవరూ చూడట్లేదనో సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంప్‌ చేస్తున్నారా..ఇకపై అలాంటి  పనులేవీ నడవవు. ట్రాఫిక్  జంక్షన్లలో ఉండే కెమెరాలతో పాటు ఆకాశంలో ఎగురుతూ ఓ కెమెరా మిమ్మల్ని ఫాలో అవుతుంది. ట్రాఫిక్‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాటించకపోతే అప్పటికప్పుడే ఫైన్‌ వేస్తుంది. తప్పించుకుని పారిపోదామని చూస్తే  ట్రాఫిక్‌ సిబ్బందిని అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ‌ప‌‌‌‌‌‌‌‌‌ట్టిస్తుంది. హైదరాబాద్‌లో త్వరలో డ్రోన్‌ రూపంలో ఓ కొత్త ట్రాఫిక్‌ కంట్రోలర్‌ రానున్నాడు. ట్రాఫిక్‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు సభలు సమావేశాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసు బలగాలతో పనిచేయనుందీ డ్రోన్‌. అంతే కాదు ఒంటరిగా వెళ్లే మహిళలకు ఇది ఎస్కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ ఉపయోగపడుతుంది. డ్రోన్ ను మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌తో  లింక్ చేయడం వల్ల బటన్‌ నొక్కిన నిమిషాల్లో వెతుక్కుంటూ వచ్చి సాయం అందిస్తుంది. అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాగా సైరన్‌ చేస్తూ సాయం అందేంత వరకూ వెన్నంటి ఉంటుందని దీని తయారీదారులు చెబుతున్నారు. ఈ డ్రోన్‌ను ఇప్పటికే  సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates