డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న

ktr-bonthu
బండరావిర్యాలలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం (ఫిబ్రవరి-16) పర్యటించిన ఆయన… మొత్తం నాలుగు ఎకరాల్లో 828 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణానికి దాదాపు రూ. 71 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తర్వాత పెద్ద అంబర్‌పేట్ నంచి బలిజగూడ మీదుగా కవాడిపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు వెడల్పు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, GHMC మేయర్ బొంతు రామ్మోహన్, MP బూర నర్సయ్య గౌడ్, GHMC  కమిషనర్ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates