ఢిల్లీకి  బయలుదేరిన సీఎం కేసీఆర్‌

KCR-Delhiసీఎం కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ బేగం పేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రేపు(శుక్రవారం,జూన్-15) మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు.

ఈసారి మోడీతో సమావేశం కానున్న కేసీఆర్ …. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పథకాలతోపాటు…రాజకీయ అంశాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది. కొత్త జోన్లు, రైతు బంధు, రైతు బీమా పథకం ప్రత్యేకతను ప్రధానమంత్రికి వివరించే అవకాశం ఉంది. హైకోర్టు విభజన, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి పెండింగ్ అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ఈనెల 17న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates