ఢిల్లీకి మళ్లీ… పొల్యూషన్ ఎఫెక్ట్

దేశ రాజధాని ఢిల్లీ… పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి. గతేడాది టాప్ టెన్ నిలిచిన ఢిల్లీ లో మళ్లీ పొల్యూషన్ పెరుగుతోంది. ఏటా శీతకాలంలో దేశ రాజధానిని కాలుష్యం పట్టి పీడిస్తోంది. చలికాలం దగ్గరక పడుతుండటంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పవన నాణ్యతా సూచీ క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో పవన నాణ్యతా సూచీ ప్రమాదకర స్థాయిలో 407 పాయింట్లు, పంజాబీ భాగ్‌ ప్రాంతంలో 307 పాయింట్లు నమోదైంది. పంజాబ్‌, హర్యాణ మీదుగా వీస్తున్న వాయువ్య గాలుల ప్రభావంతోనే కాలుష్యం పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రాష్ట్రాల్లో కోతల తర్వాత వ్యర్థాలను తగలబెడుతుండడంతో ఆ పొగ ఢిల్లీకి చేరుతోంది. నగరంలో పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోవడానికి ఈ రాష్ట్రాల్లో పంటలను తగలబెట్టడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

గతేడాది ఢిల్లీలో పొల్యూషన్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వీచే గాలుల ద్వారా ఎక్కువగా కాలుష్య కారకాలు వస్తుండడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయా రాష్ట్రాల సీఎంలతో దీనిపై సమీక్ష నిర్వహించారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్‌బడ్జెట్‌ పేరుతో ప్రత్యేక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది.

Posted in Uncategorized

Latest Updates