ఢిల్లీకి రాష్ట్ర హోదా సాధ్యం కాదు : గవర్నర్, సీఎం కలిసి పనిచేసుకోవాలి

delhiఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెఫ్ట్ గవర్నర్ మధ్య నడుస్తున్న వివాదంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని రావని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతన్న చీఫ్ జస్టిస్.. లెఫ్టినెంట్ గవర్నర్ కు స్వతంత్ర్య అధికారాలు ఉండవని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్.. రాష్ట్ర కేబినెట్ తో కలిసి పనిచేయాలన్నారు.  ఎన్నికైనా ప్రభుత్వానికే నిజమైన అధికారం ఉంటుందని కోర్టు సృష్టం చేసింది.

Posted in Uncategorized

Latest Updates