ఢిల్లీకి సీఎం కేసీఆర్

hqdefaultతెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం (ఫిబ్రవరి-9) ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా శనివారం (ఫిబ్రవరి-10) పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశముంది. బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు, రైతులకు మద్దతు ధర, రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ, నియోజకవర్గాల పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కు నిధుల కేటాయింపు, ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్ష భేటీ కోసం ప్రధాని అపాయింట్ మెంట్ సహా పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ చర్చించే చాన్సుంది.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి వినతిపత్రం అందజేయనున్న సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరనున్నారు.

Posted in Uncategorized

Latest Updates