ఢిల్లీని కమ్మేసిన గాలి కాలుష్యం: మరోసారి సరి-బేసి విధానం


గాలి కాలుష్యం ఢిల్లీ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వరుసగా నాలుగో రోజు కాలుష్యం నగరాన్ని కమ్మేసింది. ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఢిల్లీ డేంజర్ జోన్ లోకి వెళ్లింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాలుష్య పరిస్థితిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢీల్లీ-ఎన్ సీఆర్  ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అత్యవసరం అయితే మినహా ప్రజలు బయటకు రావొద్దన్నారు అధికారులు. రోడ్లపైకి వస్తే మాత్రం ముఖానికి మాస్కులు ధరించాలని సూచించారు.

కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మరోసారి సరి-బేసి విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు  చెప్పారు. నాలుగేళ్లుగా భారీగా చెట్లు పెంచామ్నారు. 3 వేల ఈకోఫ్రెండ్లీ  బస్సులను కొనుగోలు చేస్తున్నామని, మెట్రోను పొడిగిస్తున్నామని చెప్పారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి పౌరుడు పాటుపడాలని కేజ్రీవాల్  కోరారు.

కాలుష్యాన్నితగ్గించేందుకు 2016లో ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా సరి-బేసి విధానాన్ని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. ఆ ఏడాది జనవరి 1 నుంచి 15 వరకు సరి-బేసి విధానాన్ని అమలు చేసింది.  అయితే కొన్నివర్గాల వారికి మినహాయింపు ఇవ్వడం వివాదమైంది. 2017 నవంబర్ లోనూ కొన్ని రోజులు సరి- బేసీ విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం మళ్లీ గాలి కాలుష్యం లెవల్ పెరిగిపోవడంతో మరోసారి సరి-బేసీ విధానం అమలు చేయాలని ఢిల్లీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates