ఢిల్లీలోని తెలంగాణ భవన్ పరిశీలించిన కవిత

kavitaఢిల్లీలోని తెలంగాణ భవన్ ను విజిట్ చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. భవన్ లో వసతులు, సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెల్సుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి  కవితకు తెలంగాణ భవన్ లో వసతులను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ సమాచార కేంద్రాన్ని పరిశీలించిన కవిత పలు మార్పులు చేయాలని కోరారు. మీడియా హౌజ్ ను పరిశీలించారు కవిత. ఢిల్లీలో పనిచేసే తెలంగాణ జర్నలిస్టులకు అక్కడి అన్ని హాస్పిటల్స్ లో హెల్త్ కార్డ్స్ వర్తింపచేయాలని భవన్ కమిషనర్ కు సూచించారు.  సమావేశాలకు హాజరయ్యే జర్నలిస్టులకు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటుచేయాలన్నారు కవిత.

 

Posted in Uncategorized

Latest Updates