ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. క్రిమినల్ గ్యాంగ్‌పై కాల్పులు

ఢిల్లీలోని మిలినీయం డిపో సమీపంలోని సరాయ్‌ కాలేఖాన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. గురువారం(ఆగస్టు-2) ఉదయం నీరజ్‌ భంజా గ్యాంగ్‌కు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఓ నేరస్థుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడ్డ నేరస్థుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

కొద్ది రోజులుగా మామూళ్లు వసూల్ చేస్తూ ఢిల్లీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది నీరజ్‌ భంజా గ్యాంగ్‌. ఇవాళ ఆ గ్యాంగ్ పై జరిగిన ఎన్‌కౌంటర్‌ తో జనం భయాందోళనకు గురవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates