ఢిల్లీలో కిరాతకం : శవాన్ని సూట్ కేసులో పెట్టి.. 35 రోజులు ఇంట్లోనే

swaroop-nagar-kidnapped-boy-family-ani_650x400_71518513705ఢిల్లీలో దారుణం. డబ్బు కోసం ఇంటి యజమాని కొడుకునే కిడ్నాప్ చేశాడు ఆ యువకుడు. ఆ తర్వాత భయంతో.. చిన్నారి మృతదేహాన్ని.. 35 రోజులు సూట్‌కేస్‌లో దాచి పెట్టిన దారుణ సంఘటనతో దేశం నివ్వెరపోయింది.

ఢిల్లీ స్వరూప్ నగర్ ప్రాంతానికి చెందిన అవదేశ్ సఖ్య(27) సివిల్స్ పరీక్షలు రాసేందుకు కోచింగ్ తీసుకుంటున్నాడు. డబ్బు కోసం ఇంటి యజమాని కొడుకు ఆశిష్ (7)కు కిడ్నాప్ చేశాడు. సైకిల్ కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో చిన్నారి ఆశిష్ ను చంపేశాడు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని సూట్ కేస్ లో దాచి పెట్టాడు. ఆ సూట్ కేస్ ను పరుపు కింద పెట్టుకుని 35 రోజులు గడిపాడు.

గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎలుక చచ్చి పోయిందంటూ పొరుగింటివారికి చెప్పాడు. దీంతో సెంట్ బాటిళ్లు తెచ్చి దుర్వాసన రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆశిష్ తండ్రి ఫిర్యాదు మేర పోలీసులు అనుమానంతో అవదేశ్ సఖ్య గదిని పరిశీలించగా సూట్ కేస్ లో బాలుడి మృతదేహం కనిపించింది. అవదేశ్ సఖ్యను అరెస్టు చేసిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
swaroop-nagar-kidnapped-boy-family-2-ani_650x400_61518514026

Posted in Uncategorized

Latest Updates