ఢిల్లీలో కుప్పకూలిన భవనం..ఐదుగురు మృతి

మూడంతస్థుల భవనం కుప్పకూలిన ప్రమాదంలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతిచెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఢిల్లీ, అశోక్‌ విహార్‌ ప్రాంతంలోని సవాన్‌ పార్క్‌ ఫేస్-3లో ఇవాళ (సెప్టెంబర్-26) ఉదయం ఈ ఘటన జరిగింది.  NDRFకు చెందిన రెండు టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి.

శిథిలాల కిందినుంచి ఎనిమిది మందిని రక్షించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని ట్రీట్ మెంట్ కోసం దగ్గరలోని హస్పిటల్ కి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates