ఢిల్లీలో దారుణం: 80 రూపాయల కోసం ఆటో డ్రైవర్ ను చంపేశారు

ఢిల్లీలో దారుణం జరిగింది. ఎనభై రూపాయల కోసం ఓ ఆటోడ్రైవర్ ను.. నలుగురు మైనర్ బాలురు కలిసి హత్య చేశారు. గత ఆదివారం(అక్టోబర్ 7) అర్ధరాత్రి ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్ లో ఈ ఘటన జరిగింది.  పశ్చిమ బెంగాల్ రాష్ర్టానికి చెందిన జహంగీర్ ఆలం కొన్నేళ్లుగా ఢిల్లీలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఘటన జరిగిన రాత్రి ఖాన్ పూర్ కు చెందిన నలుగరు మైనర్ బాలురు జహంగీర్ ఆటో ఎక్కారు.

నైట్ టైం కావటంతో 20 రూపాయలు ఎక్స్ ట్రా ఛార్జీ అవుతుందని ఆలం వారితో చెప్పాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా వెంటనే ఓ బాలుడు తన దగ్గర ఉన్న కత్తి తీసి ఆలం ను పొడిచాడు. తర్వాత నలుగురు బాలురు కలిసి ఆలం పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం పడుతున్నప్పటికీ.. ఆలం కొంత దూరం వరకు ఆటోనడిపాడు. నైట్ పాట్రోలింగ్ చేస్తున్న ఓ పోలీస్.. అతడిని గమనించి వెంటనే సమీపంలోని రామ్ మనోహర్ లోహియా హాస్పటల్ కు తీసుకొని వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. నలుగురు మైనర్ బాలురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates