ఢిల్లీలో పగలే చీకటి : గాలి దుమారం, వర్ష బీభత్సం

dust-strome
ఢిల్లీ ప్రజలు శనివారం భయాందోళనలకు గురయ్యారు. ఉదయం నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రత, ఉక్కబోతతో అల్లాడిపోయారు. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పుతో వణికిపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఢిల్లీని కారు మబ్బులు కమ్మేశాయి. పగలే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లే పరిస్థితి. 5 గంటల నుంచి గాలి దుమారం మొదలైంది. ఆ వెంటనే వర్ష బీభత్సం. గంట అంటే గంటలోనే మారిపోయిన వాతావరణంతో ఏం జరుగుతుంది అని అందరూ చర్చించుకోవటం జరిగింది. ఆకాశం నల్లగా మారిపోయింది. సూర్యుడు మాయం అయిపోయాడు.

ఆర్కేపురం, ద్వారక, అక్బర్ రోడ్, చత్తర్ పుర్ ఏరియాల్లో అయితే అప్పుడే కారుచీకట్లు కమ్మేశాయి. 90కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వర్షం కూడా ప్రారంభం కావటంతో భయాందోళనలో ఉన్నారు ప్రజలు. శని, ఆదివారాలు గాలి దుమారం, భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని ముందుగానే హెచ్చరించింది వాతావరణ శాఖ.

Posted in Uncategorized

Latest Updates