ఢిల్లీలో పట్టపగలు.. నడిరోడ్డుపై : రాజేష్ భారతి గ్యాంగ్ – పోలీసుల మధ్య కాల్పులు

car
దేశ రాజధాని ఢిల్లీ షేక్ అయ్యింది. పట్టపగలు, నడిరోడ్డు తుపాకుల మోతతో మార్మోగింది. ఫతేపూర్ భేరీ ఏరియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్ రాజేష్ భారతీ గ్యాంగ్ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. 30 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తుపాకులతో స్పాట్ కు వెళ్లారు. పోలీసులను చూసిన రాజేష్ గ్యాంగ్ ఫైరింగ్ ఓపెన్ చేసింది. రెండు వర్గాల మధ్య చాలాసేపు భీకర కాల్పులు జరిగాయి. కొంత మంది క్రిమినల్స్ కారులో ఉన్నారని తెలిసి.. దానిపై పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. దీంతో కారులోని నలుగురు క్రిమినల్స్ చనిపోయారు. క్రిమినల్స్ జరిపిన కాల్పుల్లోనూ ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 9వ తేదీ శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఢిల్లీలో భయభ్రాంతులకు గురి చేసింది. రాజేశ్ భారతి గ్యాంగ్ అంటే.. మోస్ట్ వాంటెండ్. ఈ ముఠాలోని క్రిమినల్స్ ఒక్కొక్కరిపై ఒక లక్ష రూపాయల రివార్డ్ కూడా ఉంది.

ఘటనా స్థలం మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చనిపోయిన క్రిమినల్స్ ను గుర్తిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates