ఢిల్లీలో పొగమంచు : ఆలస్యంగా నడుస్తున్న విమానాలు

ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఉదయం పూట రవాణా వ్యవస్థ పై ప్రభావం పడుతోంది. పొగమంచు కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజిబులిటీ కూడా 100 మీటర్ల లోపే ఉంటోంది. దీంతో వాహనదారులు ఉదయం 9 గంటలు అయినా లైట్లు వేసుకుని మరీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అటు ఢిల్లీ సహా చుట్టుపక్కల రైల్వే స్టేషన్ల లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ కూడా రోజు రోజుకూ  పడిపోతోంది.

 

Posted in Uncategorized

Latest Updates