ఢిల్లీలో భారీగా గాలి కాలుష్యం

AIR POLUTONఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయిని దాటింది. దుమ్ము, హానికారక వాయువులతో నిండిన గాలిన పీలుస్తున్న దేశ రాజధాని వాసులు ఇబ్బంది పడుతున్నారు. గాలిలో.. ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ల శాతం భారీగా పెరిగింది. ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని… దగ్గు, దమ్ములతో బాధపడుతున్నామని చెబుతున్నారు. రాజస్థాన్ లో ధూళి తుపాను కారణంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అవసరమైన రక్షణ చర్యలు తీసుకునేలా ఢిల్లీ ప్రభుత్వానికి సూచించామని తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో పరిస్తితి మెరుగవుతుందని వివరించింది.

Posted in Uncategorized

Latest Updates